ప్రశ్నించినందుకే రాహుల్‌పై కేసులా?
మంత్రి పొన్నం ప్రభాకర్
నిరసనగా కాంగ్రెస్ భారీ ర్యాలీ
ముషీరాబాద్, సెప్టెంబర్1 (విజయక్రాంతి): లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar), ప్రభుత్వ సలహాదారు వీహెచ్, మాజీ ఎమ్మెల్సీ రాములు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్‌తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ఖర్గే ప్రసంగించిన వేదికను శుద్ధి చేయడం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు అవమానకరమన్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన ఖర్గేను అవమానించేలా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు.






