24 March, 2026 | 1:23 AM

బీసీల రాజ్యాధికారం సాధించి తీరుతాం

24-03-2026 12:00 AM

కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తుంది

టీఆర్ఫీ జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ

మంచిర్యాల టౌన్, మార్చి 23: ఎన్నికల సమయంలో కాగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేస్తూ సోమ వా రం తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు టీఆర్పీ నాయకులు పట్టణంలోని ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లు ధరించి, ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్పీ జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ మాట్లాడుతూ 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చి, రెండున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ హామీలను అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించి ప్రజా ధనాన్ని లూటి చేసేందుకు సహకరించిన అధికారులపై విచారణ చేపట్టి, వారిని సస్పెండ్ చేయాలని  డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు పుట్ట లావణ్య, జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, వేముల అశోక్, టీఆర్పీ జిల్లా నాయకులు పడాల శివతేజ, దాస్యపు దీపక్, ఎండి లతీఫ్,  సీపతి సాయి కుమార్, భీమిని రమేష్, బూర రవీందర్, దొబ్బల శంకర్, గనవేని నగేష్, బొంగోని విద్యాసాగర్, అడిచెర్ల రూపాదేవి, రమేష్, మహేందర్ పాల్గొన్నారు.