24 March, 2026 | 1:24 AM

ప్రజా దివాస్‌తో సమస్యలకు పరిష్కారం

24-03-2026 12:00 AM

ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ 

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) మార్చి 23 (విజయక్రాంతి): ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే ప్రజాదివాస్ లక్ష్యమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు.

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలతో నేరుగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని కోరారు.