calender_icon.png 2 November, 2025 | 9:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగులకూ కాంగ్రెస్ మోసం

29-10-2025 01:30:33 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): దివ్యాంగులకు రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెన్షన్ పెంపు చేస్తామని చెప్పి అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. దివ్యాంగుల హక్కులను కాపాడగల పార్టీ బీజేపీ ఒక్కటేనని.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దివ్యాంగులు బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. నాంపల్లిలోని పార్టీ రాష్ర్ట కార్యాలయంలో బీజేపీ దివ్యాంగుల సెల్ రాష్ర్ట కన్వీనర్ కొల్లి నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో దివ్యాంగులతో రాంచందర్‌రావు మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సమస్యలు తెలుసుకుని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు.