calender_icon.png 2 November, 2025 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మంలో ఆన్‌లైన్ ఓపెన్ హౌస్

29-10-2025 01:30:13 AM

ప్రారంభించిన సీపీ సునీల్‌దత్

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): ప్రజా సంక్షేమం, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు ఉపయోగించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోనే నేరాలు నియంత్రణలో ఉన్నాయని ఖమ్మం సీపీ సునీల్ దత్ అన్నారు. పోలీస్ అమరవీరులసంస్మరణ దినోత్సవాలను (ఫ్లాగ్ డే) పురస్కరించుకొని సిటీ ఆర్ముడ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ ‘ఓపెన్ హౌస్‘ కార్యక్రమాన్ని ఆయ న ప్రారభించారు.

పోలీసులు వినియోగించే ఫింగర్ ప్రింట్ యూనిట్, బాంబ్ డిస్పోజల్, పోలీస్ జగిలాలు శ్రమించే తీరు, పనివిధానం, సైబర్ నేరాలను పసిగట్టే విధానాలు, బ్రీత్ ఎనలైజర్స్ తదితరాలపై విద్యార్థులకు క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. చోరీలు, హత్యలు మాదకద్రవ్యాలను జాగిలాలు నేరగాళ్లను గుర్తించే విధానం, బాంబులు కనిపెట్టే తీరు తదితరాల ప్రదర్శన విద్యార్థులను ఆశ్చర్యచకితులను చేసింది.

డాగ్ స్క్వాడ్ విన్యాసాలు అలరించాయి. నేరస్తులను, బాంబులను గుర్తించటం, క్రమశిక్షణ తో డాగ్ హ్మాండీలర్స్ ఆదేశాలు పాటించే తీరు విద్యార్థులను ఆకర్షించాయి. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమా రస్వామి, ఏసీపీలు నర్సయ్య, సుశీల్ సింగ్, ఆర్‌ఐ కామరాజు, శ్రీశైలం, సురేష్, సాంబశివరావు, క్లూస్ టీమ్ ఇన్‌స్పెక్టర్ నరేష్, ఐటి కోర్ టీమ్ హేమనాధ్ పాల్గొన్నారు.