29-10-2025 01:31:55 AM
-ఆధునిక పరికరాలు అందిస్తున్న రమేష్‌కు అభినందనలు
-మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): ఆసియాలోనే రెండవ అతి పెద్ద మార్కెట్ అయిన ఎనమాముల వ్యవసాయ మార్కెట్ అపరాల యార్డ్‌లో పాషికంటి రమేష్ నేతృత్వంలో రైతులు మూస పద్ధతులను కాకుండా ఆధునిక వ్యవసాయం వైపు మళ్లాలని దృఢ సంకల్పంతో 2016లో నెలకొల్పబడి గత 10సంవత్సరాలుగా విశిష్ట సేవలను అందిస్తున్న మన అగ్రిటెక్ సంస్థను మంగళవారం దేవాదాయశాఖ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ సం దర్శించారు.
ఈ సందర్భంగా మన అగ్రిటెక్ అధినేత పాషికంటి రమేష్, వారి సిబ్బంది మంత్రిని పుష్పగుచ్ఛం అందించి ఆహ్వానించారు. మన అగ్రిటెక్‌లో వివిధ రకాల ఆధు నిక వ్యవసాయ పనిముట్లతో ఏర్పాటు చేసి న స్టాల్స్‌ను మంత్రి సందర్శించారు. పనిముట్ల గురించి రమేష్ కొండా సురేఖకు వివ రించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. మన అగ్రిటెక్ ద్వారా విశిష్ట సేవలను అందిస్తూ రైతులకు ఎంతగాను తోడ్పాటును అందిస్తున్న మన అగ్రి టెక్ సంస్థ యాజమాన్యాన్నీ మంత్రి అభినందించారు.
మారుతున్న కాలానికి అనుగు ణంగా రైతులు ఆధునిక వ్యవ సాయాన్ని అందిపుచ్చుకోని వ్యవసాయ రంగంలో రైతు లు లాభాల బాట పట్టాలని మంత్రి ఆకాంక్షించారు. ఆధునిక పరికరాలు వాడ డం వలన ఆర్థికబారం తగ్గడమే కాకుం డా రైతులకు అధిక దిగుబడి ఆశించే అవకాశం ఎక్కువ ఉంటుందన్నారు. కాగా మన అగ్రిటెక్ లో డ్రోన్ స్ప్రేయర్ మరియు ఇతర వ్యవసాయ పరికరాలు చిన్న సన్నకారు రైతుల నుండి పెద్ద వాళ్ళ వరకు అందరికి ఉపయోగ పడే ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం తరఫున ఎల్లప్పుడు సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ కేడల జనార్దన్ పాల్గొన్నారు.