23-08-2025 01:03:00 AM
ఆదిలాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): రాష్ర్ట ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. పేదలకు సన్న బియ్యాన్ని అందిస్తున్న ఘనత తమ ప్రజా ప్రభుత్వానిదేనిని వెల్లడించారు.
శుక్రవారం ఇంద్రవెల్లి మండలంలోని ఈశ్వర్ నగర్ గ్రామంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకంలో 20 లక్షలతో నిర్మించిన నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంబించడంతో పాటు 97 వేలు గొర్రెల షెడ్డు భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్ర మంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖాడే ఉత్తం, డీఆర్డీఓ పీడీ రవీందర్, ఏఈ రమేష్, నాయకులు శారద, ఎండి జహీర్, సుంకట రావు, సోమోరే నాగోరావు, మీర్జా యాకూబ్ బెగ్, ఎండి మసూద్, గోపాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.