calender_icon.png 24 August, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రానున్నది మహా సమరమే!

23-08-2025 01:39:52 AM

బీజేపీ, బీఆర్‌ఎస్ కలయిక అనివార్యం?

* తెలంగాణలో బీజేపీ-బీఆర్‌ఎస్ కూటమి గేమ్- ఛేంజర్ కావచ్చు. హైదరాబాద్ మెట్రో, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, బ్యాంకు రుణాలు, రోడ్ నెట్‌వర్క్‌ల వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ మద్దతు వంటి అనేక సానుకూల వనరులను బీజేపీ అందుబాటులోకి తీసుకొస్తుంది. దీని ప్రభావంతో కాంగ్రెస్ ఎన్నికల నిధుల తరలింపులను కూడా అరికట్టవచ్చు. ఇది కూటమికి వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందిస్తుంది. మరోవైపు, బీఆర్‌ఎస్ బలమైన స్థానిక క్యాడర్, కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు వంటి ప్రముఖ నాయకులను, కాంగ్రెస్ నెరవేర్చని వాగ్దానాలను, అంతర్గత విభేదాలను హైలైట్ చేసి లబ్ధి పొందే అవకాశం లభిస్తుంది. 

................

పొత్తులో భాగంగా కేటీఆర్‌కు ముఖ్యమంత్రి, హరీశ్‌రావుకు కేంద్రమంత్రి పదవులిచ్చి తెలంగాణ అభివృద్ధికి అవసరమైన నిధులను బీజేపీ పారించవచ్చు.

* బీజేపీ-బీఆర్‌ఎస్ కూటమిని ఎదుర్కోవడంతో పాటు అంతర్గత అసమ్మతి.. అనే ఈ రెండు సవాళ్లను సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ఎదుర్కొంటుంది. చురుకైన, యువ నాయకుడైన రేవంత్, మంత్రులు, అధికారులను ఉపయోగించుకోవడం ద్వారా, నమ్మకమైన రాజకీయ, వ్యాపార మిత్రుల బృందాన్ని ఏర్పర్చుకోవడం ద్వారా అధికారాన్ని ఏకీకృతం చేసుకున్నారు. కులగణన ద్వారా తెలంగాణ జనాభాలో 52% ఉన్న వెనుకబడిన తరగతులను ఆకర్షించడంతోపాటు కాంగ్రెస్‌ను బలోపేతం చేశారు. 

................

కాంగ్రెస్ హైకమాండ్ వనరుల డిమాండ్లను తీర్చగల రెడ్డి సామ ర్థ్యం, ఆయన చురుకైన పాలన రేవంత్‌ను బీజేపీ-బీఆర్‌ఎస్ కూటమికి బలమైన ప్రత్యర్థిగా నిలుపుతాయి. జోడోయాత్ర, బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకతతో 2023లో విజయం సాధించిన కాంగ్రెస్ ఉత్తర, దక్షిణ తెలంగాణలో తనకు తిరుగులేదనే విషయాన్ని చాటి చెప్పుకుంది.

--- అతిత్వరలో రాష్ర్టంలోని రాజకీయ యవనికపై ప్రకంప నలు చోటుకునే అవకాశం ఉంది. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో కలిసి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కూటమి ఏర్పాటుచేసే దిశగా అడుగులు పడుతున్నాయి. బీజేపీతో పొత్తు గురించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఇటీవల సంకే తాలిచ్చారు.

దీనితో రాష్ర్ట భవిష్యత్తు పునర్నిర్మాణం, పునరేకీకరణ దిశగా వ్యూహా త్మక అడుగులు పడనున్నాయనే ఊహాగానాలకు తెరలేచింది. దక్షిణ భారతదేశంలో పాగా వేసేందుకు బీజేపీకి తెలంగాణ కీలకం. అందుకే తెలంగాణపై బీజేపీ గంపెడాశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సంక్లి ష్ట పొత్తులు, ప్రాంతీయ సెంటిమెంట్లు, జాతీయ ఆకాంక్షల మధ్య 202౮ ఎన్నికలు తెలంగాణను మహా సమరానికి యుద్ధ భూమిగా మార్చనున్నాయి.

బీజేపీకి దక్షిణ ద్వారంగా తెలంగాణ

దక్షిణ భారతదేశంలో తన ప్రాభవాన్ని విస్తరించుకోవడానికి బీజేపీకి తెలంగాణ కీలకమైన ‘దక్షిణ ద్వారం’గా నిలుస్తుంది. ముఖ్యంగా పార్లమెంటరీ సీట్ల పునర్విభజన వల్ల.. పెరిగిన పోటీ కారణంగా ఉత్తర ప్రదేశ్, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల నుంచి పార్లమెంటరీ స్థానాలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నది. 2024 లోక్‌సభ ఎన్నికలలో పార్టీ బలమైన ప్రదర్శన, తెలంగాణ అసెంబ్లీ సీట్లను రెట్టింపు చేసుకుని ఎనిమిది సీట్లకు చేర్చడం వంటివి రాష్ర్టంలో బీజేపీకి పెరుగుతున్న పట్టుకు నిదర్శనంగా చెప్పొచ్చు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా దూకుడుగా చేసిన ప్రచారాలతోపాటు బీఆర్‌ఎస్‌పై ఉన్న వ్యతిరేకతను బీజేపీ ఉపయోగించుకుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఓట్లను ఏకీకృతం చేయడానికి తన హిందూత్వ ఎజెండాను వాడుకున్నది. 

అయితే, రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా స్పష్టమైన మెజారిటీని పొందలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బలమైన ప్రాంతీయ భావాలు, బీఆర్‌ఎస్ గతంలోని ఆధిపత్యం, క్లిష్టమైన రాష్ర్ట రాజకీయ నేపథ్యంలో బీజేపీకి అనేక సవాళ్లు ఎదుర వుతాయి.

2023 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ 13.9 శాతం ఓట్లతో ఎనిమిది సీట్లను మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ 64 సీట్లు, బీఆర్‌ఎస్ 39 సీట్లతో పోలిస్తే ఆ పార్టీ చాలా వెనుకబడింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం, తద్వారా జాతీయ అవకాశాలను బలోపేతం చేయాలనే లక్ష్యాన్ని సాధించడానికి బీజేపీ వ్యూహాత్మక పొత్తులను అన్వేషించాల్సిన అవసరం ఉంది.

బీజేపీ వ్యూహాలు..

తెలంగాణలో లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు బీజేపీ ముందు నాలుగు వ్యూహాలు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అవి..

స్వతంత్రంగా పోటీ చేయడం : బీజేపీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలంటే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్) సంస్థాగత బలం మద్దతు, మోదీ ప్రజాదరణపై ఆధారపడాలి. అయితే బీఆర్‌ఎస్‌కు ఉన్న ప్రాంతీయ బలం, ఇటీవల కాలంలో కాంగ్రెస్ పుంజుకున్న క్రమంలో బీజేపీ మూడో స్థానానికి పరిమితమయ్యే ప్రమాదం ఉంది. 

టీడీపీ, జనసేనతో పొత్తు : తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీ (జేఎ స్పీ)తో ముందస్తు ఎన్నికల పొత్తు ప్రతిపాదన బీజేపీ అవకాశాలను విస్తృతం చేస్తు న్నప్పటికీ ఈ వ్యూహం ప్రమాదాలతో కూడుకున్నది. ఎందుకంటే ఏపీ మద్దతుదారుగా టీడీపీకి ఉన్న గుర్తింపు కారణంగా తెలంగాణ ఓటర్లు బీజేపీకి దూరం కావడమే కాకుండా, ప్రాంతీయ సెంటిమెంట్ ను ఆయుధంగా వాడుకుంటున్న బీఆర్‌ఎస్‌కు మరింత కలిసి వచ్చేదిగా ఉంటుంది. 

ఎన్నికల అనంతరం బీఆర్‌ఎస్ పార్టీతో కూటమి : ఎన్నికల అనంతరం బీఆర్‌ఎస్‌తో కూటమి ఏర్పాటుచేసే ఆలోచన సరైంది కాకపోవచ్చు. కానీ ఈ కూటమి విజయం ఎన్నికల ఫలితం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఆచరణాత్మక విధానానికి పేరుగాంచిన బీఆర్‌ఎస్ ఎన్నికల అనంతరం దాని ప్రయోజనాల ఆధారంగా ఎన్డీఏ లేదా ఇండియా కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అందుకే ఎన్నికల అనంతరం బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకునే వ్యూహా నికి విశ్వనీయత తక్కువగా ఉంటుంది. 

ఎన్నికల ముందే బీఆర్‌ఎస్‌తో కూటమి : ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవడమే అత్యంత ఆశాజనకమైనదిగా విశ్లే షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా జాతీయ స్థాయిలో బీజేపీ సామర్థ్యం, మోదీ చరిష్మా, ఆర్‌ఎస్‌ఎస్ సం స్థాగత బలం, కేంద్ర ప్రభుత్వ నిధులు, ఎన్నికల కమిషన్ వంటి సంస్థలపై చూపే ప్రభా వం, బీఆర్‌ఎస్ ప్రాంతీయ పలుకుబడి.. బలమైన క్యాడర్, స్థానిక నాయకత్వం, తెలం గాణ సెంటిమెంట్ కలిసి వచ్చి కూటమికి బలం చేకూరుస్తుంది. 

బీజేపీ-బీఆర్‌ఎస్ కలయిక

తెలంగాణలో బీజేపీ-బీఆర్‌ఎస్ కూటమి గేమ్- ఛేంజర్ కావచ్చు. హైదరాబాద్ మెట్రో, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, బ్యాంకు రుణాలు, రోడ్ నెట్‌వర్క్‌ల వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ మద్దతు వంటి అనేక సానుకూల వనరులను బీజేపీ అందుబాటులోకి తీసుకొస్తుంది. దీని ప్రభావంతో కాంగ్రెస్ ఎన్నికల నిధుల తరలింపులను కూడా అరికట్టవచ్చు. ఇది కూట మికి వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందిస్తుంది.

మరోవైపు, బీఆర్‌ఎస్ బలమైన స్థాని క క్యాడర్, కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు వం టి ప్రముఖ నాయకులను, కాంగ్రెస్ నెరవేర్చని వాగ్దానాలను, అంతర్గత విభేదాలను హైలైట్ చేసి లబ్ధి పొందే అవకాశం లభిస్తుంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వేయా లంటే, తెలంగాణ రైతులకు యూరియా సరఫరా చేసే కూటమికే తాము మద్దతి ఇస్తా మని ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ ఉపరాష్ర్టపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్టు స్పష్టమవుతున్నది.

రెండు పార్టీలు తమ ఓటర్లను కాపాడుకోవడానికి బహిరంగంగా వ్యతిరేక వైఖరిని కొనసాగించినప్పటికీ, పరస్పర ప్రయోజనం కోసం ఎన్నికలకు ముందు పొత్తుపెట్టుకోవడం ‘చారిత్రక అవసరం’ అని విశ్లేషకులు చెబుతు న్నారు. పొత్తులో భాగంగా కేటీఆర్‌కు ముఖ్యమంత్రి, హరీశ్‌రావుకు కేంద్రమంత్రి పదవు లిచ్చి తెలంగాణ అభివృద్ధికి అవసరమైన నిధులను పారించవచ్చు.

ముస్లిం ఓటు బ్యాంకు

తెలంగాణ ఓటర్లలో గణనీయంగా ఉన్న ముస్లిం ఓటర్లు, సాంప్రదాయకంగా కాం గ్రెస్ లేదా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) వైపు మొగ్గు చూపుతారు. ముస్లింల ఓట్ల ప్రభావంతో 2023లో హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో తన ఏడు సీట్లను ఎంఐఎం నిలుపుకుంది. అయితే బీజేపీ, బీఆర్‌ఎస్ కూటమి గెలుపు కలయికగా భావిస్తే ముస్లిం ఓటర్లలో ఒక వర్గాన్ని ఆకర్షించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

గుజరాత్‌లోనూ బీజేపీ విజయం ఖా యమైన స్థానాల్లో ముస్లింలు బీజేపీకి మద్ద తు ఇచ్చారు. బీజేపీ ప్రమేయం ఉన్నప్పటికీ షాదీ ముబారక్, మైనారిటీ గురుకులాలు వంటి మైనారిటీల కోసం బీఆర్‌ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలు ముస్లిం ఓటర్లను ఆకర్షించే అవకాశాలను మరింత పెంచుతాయి.

కాంగ్రెస్ సవాళ్లు, బలాలు

బీజేపీ-బీఆర్‌ఎస్ కూటమిని ఎదుర్కోవడంతో పాటు అంతర్గత అసమ్మతి అనే ఈ రెండు సవాళ్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ఎదుర్కొంటుంది. చురుకైన, యువ నాయకుడైన రేవంత్ రెడ్డి, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఉపయోగించుకోవడం ద్వారా, నమ్మకమైన రాజకీయ, వ్యాపార మిత్రుల బృందాన్ని ఏర్పర్చుకోవడం ద్వారా అధికారాన్ని ఏకీకృతం చేసుకున్నారు.

ఆయన నాయక త్వంలో 2023లో చేపట్టిన కులగణన ద్వారా తెలంగాణ జనాభాలో 52 శాతం ఉన్న వెనుకబడిన తరగతులను ఆకర్షించడంతోపాటు కాంగ్రెస్‌ను బలోపేతం చేసింది. అయితే పార్టీ హైకమాండ్‌తో సంప్రదింపులు జరుపుతున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ తడబడితే ఆయన స్థానాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ హైకమాండ్ వనరుల డిమాండ్లను తీర్చగల రెడ్డి సామర్థ్యం, ఆయన చురుకైన పాలన రేవంత్‌రెడ్డిని బలమైన ప్రత్యర్థిగా నిలుపుతాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకతతో 2023లో విజయం సాధించిన కాంగ్రెస్ ఉత్తర, దక్షిణ తెలంగాణలో తనకు తిరుగులేదనే విషయాన్ని చాటి చెప్పుకుంది.

2029 ఎన్నికల్లో మహా యుద్ధం

అసెంబ్లీ సీట్లు పెరగడం, అసెం బ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ-బీఆర్‌ఎస్ కలయికకు అవకాశం ఉ న్నందున తెలంగాణ రాజకీయ వా తావరణం అస్థిరంగా మారుతుంది. రాజకీయ శత్రువులు మిత్రులుగా మారి ఎన్నికలకు ఆరునెలల ముం దు పొత్తులు ఏర్పడే అవకాశం ఉం ది.

కేటీఆర్ సూచించినట్లుగా, బీఆర్‌ఎస్ బీజేపీ కూటమిలో చేరడానికి సిద్ధంగా ఉండటం, కాంగ్రెస్ దూకుడును  ఎదుర్కోవడానికి ఆచరణా త్మక విధానాన్ని సూచిస్తుంది. మోదీ ప్రసంగాలు, ప్రచారాలు, ఆర్‌ఎస్‌ఎస్ సంస్థాగత బలం, మద్దతుతో దక్షిణాదిలోనే బలమైన తెలంగాణలో పాగా వేయడంపై కొత్త సమీక రణలతో, బీజేపీ దక్షిణాదిలో ప్రవేశించాలనే దాని దృఢ సంకల్పం నెరవేరవచ్చు.

సి.ఎల్.రాజం
చైర్మన్, విజయక్రాంతి