23-08-2025 01:03:17 AM
నకిరేకల్ ఆగస్టు 22(విజయ క్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఊరూరా పనుల జాతర కార్యక్రమంలో భాగం గా శుక్రవారం మండలంలోని గొల్లగూడెం గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించే గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా ఏర్పాటుచేసిన ట్రాన్స్ ఫార్మర్లను ప్రారంభించారు.
మండలంలోని కడపర్తి గ్రామంలో రూ. 12 లక్షల వ్యయంతో నిర్మించే అంగన్వాడి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరరావు, ఎంపీడీవో జే. వెంకటేశ్వరరావు, ఐసిడిఎస్ సిడిపిఓ అస్రా అంజుమ్, పంచాయతీరాజ్ డిప్యూటీ డిఈ కొండయ్య,
ఏఈ సంపత్ కుమార్, ఐసిడిఎస్ సూపర్వైజర్ భవాని, నాయకులు బచుపల్లి గంగాధర్ రావు, గాదగోని కొండయ్య, నకిరేకటి ఏసు పాదం, చిర్రబోయిన శ్రీను, ముక్కాముల వెంకన్న, పాటి యాదగిరి రెడ్డి, గ్రామ కార్యదర్శులు కిరణ్ కుమార్, కోటమ్మ, అంగన్వాడీ టీచర్ ఆకుల లింగమ్మ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.