calender_icon.png 23 August, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఐ సీనియర్ నేత సురవరం కన్నుమూత

23-08-2025 01:28:12 AM

  1. వృద్ధాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచిన నేత
  2. విద్యార్థి దశలోనే వామపక్ష ఉద్యమాల వైపు మొగ్గు
  3. నల్లగొండ నుంచి 1998, 2004లో ఎంపీగా గెలుపు
  4. జిల్లాను ఫ్లోరైడ్ రహితం చేసే పోరాటాల్లో చురుకైన పాత్ర
  5.   2012-2019 వరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలు

హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): సీపీఐ జాతీయ నేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి (83) కన్నుమూశారు. కొంతకాలం నుంచి ఆయన వృద్ధాప్య సమస్యలతో సతమతమవుతూ హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. 1942 మార్చి 25న మహబూబ్ నగర్ జిల్లా కొండ్రావుపల్లిలో సుధాకర్‌రెడ్డి జన్మించారు. ఆయన తండ్రి వెంక ట్రామిరెడ్డి అప్పటికే స్వాతంత్య్ర పోరాట యోధుడు.

తెలంగాణ సాయుధ పోరాటంలోనూ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆ ప్రభావం విద్యార్థి దశలోనే సుధాకర్‌రెడ్డిపై పడింది. దీంతో ఆయన వామపక్ష ఉద్య మాలకు ఆకర్షితుడయ్యారు. సీపీఐ అనుబంధ విద్యార్థి సంఘమైన ఏఐఎస్‌ఎఫ్‌లో సాధారణ కార్యకర్తగా చేరి అంచెలంచె లుగా ఎదిగారు.  1957లో కర్నూలులో బీఏ చదువుతున్న సమయంలో సుధాకర్‌రెడ్డి సమ యంలో విద్యార్థుల హక్కుల కోసం పోరాడారు.

క్రమంగా ఆ ఉద్యమం కర్నూలు పట్ట ణంలోని అన్ని కళాశాలలు, పాఠశాలలకు పాకింది. క్రమంగా అది మహా ఉద్యమంగా మారింది.  సుధాకర్‌రెడ్డి సేవలను గుర్తించిన పార్టీ అధిష్ఠానం ఆయన్ను 1960లో ఏఐఎస్‌ఎఫ్ కర్నూల్ పట్టణ బాధ్యతలు అప్పగిం చింది. 1965లో హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ చదు వుతున్న కాలంలో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో గెలిచి, వర్సిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

1966లో ఏఐఎస్‌ఎఫ్ జాతీ య కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1968 ఎల్‌ఎల్‌ఎంలో చేరినప్పటికీ ఉద్యమాల్లో కీలకం గా పనిచేస్తున్నందున ఆ కోర్సులో కొనసాగలేకపోయారు. 1969లో రెండోసారి కూడా పార్టీ విద్యార్థి సంఘానికి జాతీ య కార్యదర్శి అయ్యారు. 1972లో పార్టీ యువజన సం ఘం జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. 1971లో కేరళలోని కొచ్చిన్‌లో పార్టీ జాతీయ సమా వేశాలు జరిగాయి.

ఈ సమావేశాల్లో ఆయన మొదటిసారి పార్టీ జాతీయ సభ్యుడిగా ఎదిగారు. 1974లో ఆయనకు విజయలక్ష్మితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. 2000 సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెం పు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1974 నుంచి 1984 వరకు నాటి ఆంధ్రప్రదేశ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా సేవలందించారు.  1998, 2004 సార్వత్రిక ఎన్నికల్లో సుధాకర్‌రెడ్డి నల్లగొండ పార్లమెంటరీ నియోజ కవర్గం నుంచి సీపీఐ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.

జిల్లా నుంచి ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమికొట్టేందుకు జరిగిన అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. 2007లో హైదరాబాద్‌లో జరిగిన సీపీఐ జాతీయ మహాసభల్లో ఉప ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2012లో బీహా ర్ రాజధాని పాట్నాలో జరిగిన పార్టీ జాతీ య సభల్లో ఆయన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యా రు. అప్పటి నుంచి అప్రతిహతంగా 2019వరకు ఆ పదవిలో ఉండి పార్టీకి సేవలందించారు. చండ్ర రాజేశ్వర్‌రావు తర్వాత పార్టీ జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన రెండో తెలుగు నేత సురవరం సుధాకర్‌రెడ్డి కావడం విశేషం.

సీఎం, మంత్రులు, ప్రముఖుల సంతాపం..

రాజకీయాల్లో అజాతశత్రువుగా సుధాకర్‌రెడ్డి పేరుతెచ్చుకు న్నారని కొనియాడారు. ఆయన లేని లోటు వామపక్ష రాజకీయాలకు పెద్దలోటు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యు లకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. మారుమూల ప్రాంతంలో పుట్టి, వామపక్ష ఉద్యమాల్లో ఎదిగి, జాతీయ  నేతగా ఎదిగారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని డిప్యూటీసీఎం భట్టివిక్రమార్క ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

నిబద్ధత, నిజాయతీ, క్రమశిక్షణ గలిగిన నేతగా సుధాకర్‌రెడ్డికి పేరున్నదని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి గుర్తుచేస్తూ సంతాపం తెలిపారు. బడుగు, బలహీన వర్గాల బాగోగుల కోసం సుధాకర్‌రెడ్డి జీవితకాలం పోరాటం చేశారని మంత్రి దామోదర రాజనర్సింహ కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి పనిచేశారని శ్లాఘించారు.

మార్క్సిస్టుల్లో ప్రజానేతగా సుధాకర్‌రెడ్డికి గుర్తింపు ఉందని మాజీ సీఎం కేసీఆర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యపాత్ర పోషించారని గుర్తచేసుకున్నారు. పీడిత వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు.