calender_icon.png 23 August, 2025 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యా, వైద్య‌, ర‌వాణా సౌక‌ర్యాలకు ప్ర‌త్యేక శ్ర‌ద్ద

23-08-2025 08:33:04 AM

  సింగూరును టూరిస్ట్ హబ్ గా మారుస్తా 

 రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ్మ 

 మునిపల్లి మండలంలో రూ.70 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

మునిప‌ల్లి, (విజయక్రాంతి): విద్యా, వైద్యం, ర‌వాణా సౌక‌ర్యాలకు  ప్ర‌జా ప్ర‌భుత్వంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ద వ‌హిస్తుంద‌ని  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ పి . ప్రావిణ్య తో కలిసి సంగారెడ్డి జిల్లా మునిప‌ల్లి  మండ‌ల పరిధిలోని  ఆయా గ్రామాల్లో  రూ. 70కోట్లతో ప‌లు  ప‌నుల‌కు శంకుస్ధాప‌న‌లు చేసి ప‌నుల‌ను ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ   మండ‌లంలోని  బుదేరా కళాశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను మెరుగుపరిచి రానున్న ఆరు నెలల్లో కళాశాలను తెలంగాణ రాష్ట్రంలోనే  కళాశాలల‌ను  రోల్ మోడల్ గా మార్చేలా కృషి చేయనున్నట్లు తెలిపారు. కళాశాలలో చదివే విద్యార్థులకు భద్రత కల్పించడంతోపాటు మెరుగైన వసతులు కల్పించనున్నట్లు అధునాతన సౌకర్యాలతో కూడిన ల్యాబ్ లు, డిజిటల్ తరగతి గదులు, మెరుగైన ఫర్నిచర్, లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్లు విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కళాశాలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  ఇటీవ‌ల కురిసిన   భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను మంత్రి పపరిశీలించి  వాటి మ‌ర‌మ్మ‌తుల కోసం నివేదికకు అంద‌జేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.  అలాగే  సింగూరు ప్రాజెక్ట్ ను టూరిస్ట్ హబ్ గా త్వరలో  మార్చనున్నట్లు  తెలిపారు.

మునిపల్లి మండలంలోని గార్లపల్లి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితేఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌నున్న‌ట్లు తెలిపారు.  అలాగే బుదేరా నుండి సిరూర్  వరకు సింగూరు బ్యాక్ వాటర్ వెంట రెండు లైన్ల రోడ్డు ఏర్పాటు కోసం రూ. 60 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.  ఈ రోడ్డుతో సింగూరు ప్రాజెక్టు వెనుక భాగంలోని రాయికోడ్ మునిపల్లి మండలాలలో గ్రామాలు అభివృద్ధి చెందనున్నట్లు తెలిపారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 100 కిలోమీటర్ల లోపు ఉన్న పెద్ద ప్రాజెక్టు సింగూరు ప్రాజెక్టు అన్నారు. అందుకు  సింగూరు ప్రాజెక్టును టూరిజం హబ్ గా మార్చడానికి కృషి చేయనున్నట్లు తెలిపారు.  సింగూరు ప్రాజెక్టు మధ్యలో రామచంద్రాపురం శివారులో నీట మునుగకుండా ఉన్న 15 ఎకరాల విస్తీర్ణం లోని భూమిలో రిసార్ట్ హోటల్ ను  ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో సింగూరు బ్యాక్ వాటర్ వెంట గ్రామాలలో ప్రభుత్వ,  ప్రైవేటు ఆధ్వర్యంలో రిసా ర్ట్్స  ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. హైదరాబాద్  నుండి సింగూరు ప్రాజెక్టు చూడడానికి వచ్చే టూరిస్టులు సింగూరు ప్రాజెక్టును చూసి పడవలలో రామచంద్రపురం రిసార్ట్ కు వచ్చి మధ్యాహ్నం భోజనం చేసుకొని రాత్రి సింగూరు బ్యాక్ వాటర్ వెంట వెలిసే రిసార్ట్లలో విశ్రాంతి తీసుకునేలా టూరిస్టు హబ్ ను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. బుదేరా సిరూరు రోడ్డు ఏర్పాటుతోపాటు సింగీతం నుండి కోడూరు వరకు రోడ్డు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  ఈ రెండు రోడ్ల నిర్మాణంతో సింగూరు బ్యాక్ వాటర్ గ్రామాలకు మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు కలగడంతో పాటు ఈ ప్రాంతం టూరిస్ట్ హబ్ గా మారనున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. 

రూ. 70 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి: 

మునిపల్లి పర్యటన సందర్భంగా మంత్రి మండలంలో ని వివిధ గ్రామాలలో రూ. 70 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం శంకుస్థాపన చేశారు. మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనుల వివరాలు ఇలా ఉన్నాయి. 2.20 కోట్లతో సాంఘీక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల, బుదేర లో ఆదనపు తరగతి గదులు మరియు ప్రహారీ గోడ నిర్మాణం, 43 లక్షలతో కళాశాలలో మౌళిక సదుపాయాలు , 98 లక్షలతో మునిపల్లి-ఖమ్మంపల్లి బి.టి. రోడ్డు నిర్మాణం,  1.24 కోట్లతో మోడల్ స్కూల్, మునిపల్లిలో చేసిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం,  34.50 లక్షలతో యస్.సి. బాయ్స్ హాస్టల్, మునిపల్లిలో పలు అభివృద్ధి పనులు

1.96 కోట్లతో మునిపల్లి చందాపూర్ బి.టి.రోడ్డు నిర్మాణం,  1.26 కోట్లతో పి.డబ్ల్యుడి రోడ్డు - తక్కెడల్లి బి.టి. రోడ్డు నిర్మాణం. 57.50 లక్షలతో కె.జి.బి.వి. తాటిపల్లి లో మౌళిక సదుపాయాలు, 37 లక్షలతో నిర్మించిన వంటశాల, ఇతర మరమ్మత్తులకు ప్రారంభోత్సవం 42 కోట్లతో తాటిపల్లి-మక్తక్యాసారం డబల్ రోడ్డు నిర్మాణం, 17 కోట్లతో గార్లపల్లిలో హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ కలెక్టర్ పి ప్రావీణ్య త తో కలిసి శంకుస్థాపన చేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాల చైర్మన్ అంజయ్య, సంగారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి రవీందర్ రెడ్డి,  ఆయా  శాఖల అధికారులు, నాయ‌కులు త‌దిత‌రులు  పాల్గొన్నారు.