1 August, 2026 | 2:55 PM

కేసీఆర్‌పై బురద జల్లుతున్న కాంగ్రెస్

03-09-2025 12:22 AM

జుక్కల్, సెప్టెంబర్ 2 : జుక్కల్ నియోజక వర్గంలో ఈ రోజు గత రెండు రోజులు నుండి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం అయిన కేసీఆర్ పై చేస్తున్న అసత్య ప్రచారం, కాలేశ్వరం ప్రాజెక్టు పై సీబీఐ విచారణతో బురదజల్లే మాటలను వ్యతిరేకిస్తూ కాలేశ్వరం పై వేసిన కమిషన్,

ప్పుడు మాటలను వ్యతిరేకిస్తూ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆదేశాల మేరకు మంగళవారం మాజీ ఎంపీపీ నీలు పాటిల్  ఆధ్వ ర్యంలో జుక్కల్ మండల బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నుండి బసవేశ్వర చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలను మానుకోని ముందు మీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసి ప్రజల్లో వెళ్లాలన్నారు. రాబోయే కాలంలో మీకు డిపాజిట్ కూడా రాదు కాబట్టి ఇటువంటి మాటలు మానుకొని అభివృద్ధి పైన తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి మాట్లాడాలని హితువు పలికారు.  జుక్కల్ మండల టిఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

కామారెడ్డిలో పాల్గొన్న మాజీ ప్రభుత్వ విప్

కామారెడ్డి, సెప్టెంబర్ 2 (విజయ క్రాంతి), కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.  బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దిన్, మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ నది జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి కాలేశ్వరాన్ని ఎండబెట్టి ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు.

కామారెడ్డి జిల్లాలోని 25 మండలాల్లో టిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా రాస్తారోకో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. నిన్నటిదాకా సిబిఐ పైన వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టును సిబిఐకి అప్పజెప్పడం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే మునుముందు ధర్నా కార్యక్రమాలు ఇంకా ఉధృతం చేస్తామన్నారు.

బెదిరింపులు కేసులు మా పార్టీకి కొత్త కాదని అన్నారు. ఒకవైపు రైతులు పంటలకు యూరియా లేక అల్లాడిపోతుంటే వారి గురించి పట్టించుకునే వారే కరువయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు జూకంటి మోహన్ రెడ్డి, కొత్తింటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్ కుమార్, భాను ప్రసాద్, సుమిత్రానంద్, విజయ రెడ్డి, వజ్జపల్లి ఆంజనేయులు, లక్ష్మీనారాయణ, బల్వంత్ రావు, తదితరులు పాల్గొన్నారు.