గణేష్ ఉత్సవాలకు భారీ బందోబస్తు
ఎస్పీ జానకి షర్మిల
బైంసా, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): గణే ష్ నిమజ్జనం ఉత్సవాలకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించాలని ఎస్పీ జానకి షర్మిల పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ముథోల్ నియోజ కవర్గంలో గణేష్ ఉత్సవాల నిర్ణయాలపై పోలీ సు అధికారులతో సమావేశం నిర్వహించి తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు.
గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిర్వహించే ప్రదేశాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలని అల్లరిముకలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని, భక్తి వాతావరణం లో గణేష్ వేడుకలను నిర్మించుకోవాలన్నారు. డిజె సిస్టంపై సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా ఎవరు నడిచిన వారిపై చర్యలు ఉంటాయని, చెరువు లు ప్రాజెక్టుల వద్ద ప్రమాదాలు జరగకుండా భారీకేర్లు నిర్మించాలని సూచించారు ఈ సమావేశంలో ఏఎస్పీలు ఉపేందర్ రెడ్డి రాజేష్ మీనా అవినాష్ కుమార్ పాల్గొన్నారు






