బాధితులకు పరిహారం అందించి ఆదుకోవాలి
మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు
దండేపల్లి, సెప్టెంబర్ 2 : వరదతో మంచిర్యాల నియోజక వర్గంలో పంట నష్టపోయి న బాధితులకు పరిహారం అందించి ప్రభు త్వం ఆదుకోవాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని గోదావరి నది సమీప గుడిరేవు, లక్ష్మీ కాంతపూర్ గ్రామాలలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ పంట నష్టపోయి న రైతులకు ఎకరానికి రూ. 40 వేల పరిహా రం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ వైస్ ఎంపీపీ అనిల్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రేణి శ్రీనివాస్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు చుంచు శ్రీనివాస్, నాయకులు అక్కల రవీందర్, రాజి రెడ్డి, వెంకట రమణ, బొమ్మెన మహేశ్, రాయమల్లు, రమేశ్, రైతులు తదితరులున్నారు.






