27 April, 2026 | 11:44 AM

Breaking News

న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు: కేజ్రీవాల్ సంచలన నిర్ణయం   •   హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి   •   హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. ​ఎక్కడ చూసిన నో స్టాక్ బోర్డులు   •   నార్కెట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం: సాఫ్ట్‌వేర్ మృతి   •   ప్రతి కుటుంబం ఖచ్చితంగా వివరాలు నమోదు చేసుకోవాలి: భట్టి విక్రమార్క   •   బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు.. ఒక విప్లవం!   •   శ్రీవారి సేవలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు   •   దమ్మాయిగూడెం వద్ద రెండు లారీలు ఢీ   •   నిరుపేద చిన్నారి ప్రాణాల కోసం పోరాటం – దాతల సాయం కోసం తల్లిదండ్రుల విజ్ఞప్తి   •   బంకులు బంద్.. ప్రజలు పరేషాన్   •  

హక్కులను కాంగ్రెస్ కాలరాస్తోంది

26-06-2024 01:23 AM

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీరుద్రమ

హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): 1975 జూన్ 25న నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశ పౌరుల హక్కులను కాలరాసేలా ఎమర్జెన్సీ విధించిన రోజు అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీరుద్రమ గుర్తుచేశారు. రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరిగానే నేటి కాంగ్రెస్ సర్కారు ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రేవంత్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు లెక్కలేనట్లుగానే భావిస్తున్నారని ఆమె అన్నారు.

కాంగ్రెస్ 6 గ్యారెంటీలు, 13 ప్రధాన హామీలతో మొత్తంగా 400 హామీల పేరుతో అధికారంలోకి వచ్చిందని, కానీ ఇచ్చిన హామీలను అమలుచేయకుండా దగా చేసి జనం నెత్తిపై గాడిద గుడ్డు మోపిందని మండిపడ్డారు. ఆర్నెల్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం సీఎం ఆఫీసు చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా రేవంత్‌రెడ్డి కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్నారు. వారి సమస్యలు చెప్పుకునేం దుకు కనీసం విద్యాశాఖ మంత్రి కూడా లేని దుస్థితి ఏర్పడిందన్నారు. విద్యాశాఖను గుప్పిట్లో పెట్టుకున్న ముఖ్యమంత్రి ఉపాధ్యాయుల సమస్యలపై స్పందించడం లేదని విమ ర్శించారు.

రేవంత్‌రెడ్డికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ఉపాధ్యాయు ల సమస్యలుపై లేదన్నారు. ప్రభు త్వం ఎస్జీటీలుగా నియమించినవారికి ప్రమోషన్లు ఇవ్వకుండా వేధిస్తోం దన్నారు. రాష్ర్టంలోని 65 వేల మం ది ఎస్జీటీ క్యాటగిరీ ఉపాధ్యాయులకు ప్రమోషన్స్‌లో సమన్యాయం పాటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో సీఎం ఇచ్చిన హామీ ప్రకారం ఖాళీగా ఉన్న 25వేల టీచర్ పోస్టులు నింపేందుకు జంబో డీఎస్సీ ఎప్పుడు ప్రకటిస్తారని ప్రశ్నించారు.