calender_icon.png 2 November, 2025 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రి జిల్లాలో హైటెన్షన్...

02-11-2025 11:07:33 AM

హైదరాబాద్: భద్రాద్రి జిల్లాలో హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మణుగురులోని భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడికి పాల్పడ్డారు. బీఆర్ఎస్ కార్యాలయంలో ఉన్న  ఫర్నిచర్ కు నిప్పంటించి పార్టీ ఆఫీసు ఆవరణలోని ఫ్లెక్సీలు చింపేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్న కార్యకర్తలు బీఆర్ఎస్ జెండా, గద్దెను ధ్వంసం చేశారు. అనంతరం ప్రభుత్వ స్థలంలో భారత రాష్ట్ర సమితి కార్యాలయం నిర్మించారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు.  పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.