చెప్తాం.. మేము పాటించం!
* ఈ ఫొటో చూడండి.. ఏదో రైస్ మిల్లులో ధాన్యాన్ని అన్‌లోడింగ్ చేస్తున్నట్టుగా కనపడుతుంది కదా. నిజమే.. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని నిజామాబాద్ జిల్లా బోధన్ సమీపంలోని అచన్‌పల్లిలో నందిని ఆగ్రో ఫుడ్ రైస్ మిల్లులో అన్‌లోడింగ్ చేస్తున్న దృశ్యమిది.
- ధాన్యాన్ని దించుకోవద్దన్నవారే దింపుకున్నారు
- మిల్లర్ల సంఘం నాయకులపై మిల్లర్ల అసంతృప్తి
- రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ధాన్యం అన్‌లోడింగ్ సమ్మె
- ఈనెల 16 జనరల్‌బాడీ మీటింగ్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం
హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): గౌరవనీయ సభ్యులారా.. నిన్న హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి రైస్ మిల్లర్స్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా సీఎంఆర్ ప్యాడీని అన్‌లోడ్ చేయకూడదని ఏకగ్రీవంగా నిర్ణ యం తీసుకున్నారు. మనం రాష్ట్ర అసోసియేషన్ సభ్యులుగా ఉన్నందున, రాష్ట్రస్థాయిలో తీసుకున్న నిర్ణయాలను అనుసరించడం మన బాధ్యత.
ఈరోజు ప్రధాన అసోసియేషన్ సీనియర్ నాయకత్వంలో అధ్యక్షులు, కార్యదర్శులు, వర్కింగ్ ప్రెసిడెంట్స్ అయిన దయానంద్‌సేత్, మోహన్‌రెడ్డి, బచ్చు రామ్‌సేత్‌తో సమ్మె, ప్యాడీ అన్‌లోడింగ్ విషయా లపై చర్చించనున్నాం. వారి మార్గదర్శకత్వం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుని, ప్రధాన అసోసియేషన్ సూచనను అనుసరిస్తాం.
ధన్యవాదాలతో..
ఇదేంటి.. పైన ఉన్న ఫొటోకు.. కింద ఉన్న సమాచారానికి పూర్తి విరుద్ధంగా ఉందనే అనుమానం వస్తుంది కదా. ఇదికూడా నిజమే. రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి సేకరిస్తున్న ధాన్యాన్ని ఏ రైస్ మిల్లర్ కూడా అన్‌లోడింగ్ చేసుకోవద్దని, పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించుకున్న తరువాతనే అన్‌లోడింగ్ చేసుకోవాలని, దీనిపై ఈనెల 16న హైదరాబాద్‌లో జనరల్‌బాడీ మీటింగ్‌లో నిర్ణయం తీసుకుందా మని.. అప్పటివరకు ధాన్యాన్ని అన్‌లోడింగ్ చేసుకోవద్దని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్లకు సంఘాల పెద్దలు సమాచారాన్ని అం దించారు.
అయితే సంఘం బాధ్యుల నుంచి సమాచారం రావడంతో ఏ మిల్లరు కూడా ధాన్యాన్ని అన్‌లోడింగ్ చేసుకోవడం లేదు. అయితే ఇలా సమాచారం ఇచ్చిన పెద్దలకు చెందిన రైస్ మిల్లుల్లోనే ధాన్యాన్ని అన్‌లోడింగ్ చేసుకోవడం.. ఇందుకు సంబంధిం చిన ఫొటోలు బయటకు రావడంతో రైస్ మిల్లర్లందరూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఇదీ స్థూలంగా ఈ ఫొటోలు, మెస్సే జ్‌లకు సంబంధించిన అసలు కథ.
రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలో రైస్ మిల్లర్లు
ప్రభుత్వ పరిష్కరించాల్సిన పలు సమస్యలు ఉన్న నేపథ్యంలో రైస్ మిల్లర్లు 2025 సీజన్ ధాన్యం (యాసంగి) అన్‌లోడింగ్‌ను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. 2025-26 సీజన్ రైస్ ప్రొ క్యూర్‌మెంట్, 10 శాతం నూకతో రా రైస్ ఇవ్వడం గురించి, కొత్త అగ్రిమెంట్‌ను ఏర్పాటుచేసుకోవడం, 25 శాతం పెనాల్టీ, 12 శాతం ఇంట్రెస్ట్ గురించి అలాగే 2025-26 యాసంగిలో రా రైస్ టెస్ట్ మిల్లింగ్ గురించి, మిల్లర్లకు రావాల్సిన చార్జీల గురించి ప్రభుత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకునేంత వరకు ప్రస్తుత సీజన్‌కు సీఎంఆర్ ధాన్యాన్ని దిగుమతి చేసుకోకూడదని రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం నిర్ణయించింది.
ఈ సమస్యలపై ఈనెల 16న హైదరాబాద్‌లో జనరల్ బాడీ మీటింగ్ ఉంది. ఇందులో వీటిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అప్పటివరకు అన్‌లోడింగ్‌ను నిలిపివేశారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలనే సమాచారాన్ని అందించిన నా యకులకు చెందిన రైస్ మిల్లుల్లో ధాన్యాన్ని అన్‌లోడింగ్ చేసుకోవడంతో రైస్ మిల్లర్లు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు.
నిజామాబాద్ జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ లో తాలూకా ప్రెసిడెంట్‌కు చెందిన నందిని ఆగ్రో ఫుడ్ రైస్‌మిల్‌లో అన్‌లోడింగ్ అవుతున్న ఫొటోలు అధికారికంగా బయటకు రావడంతో మిల్లర్లు అసంతృప్తి వెల్లడించారు. బోధన్ సమీపంలోని రుద్రూరులోని కామధేను ఫుడ్ ప్రాసెస్‌కు చెందిన మిల్లులో కూడా ధాన్యాన్ని అన్‌లోడింగ్ చేయడంతో నిజామాబాద్ మిల్లర్లందరూ ఆగ్రహం వ్యక్తంచేశారు. స్టార్ ఆగ్రో రైస్ మిల్‌లో ధాన్యం అన్‌లోడింగ్‌కు వాహనాన్ని సిద్ధంచేసిన ఫొటోలుకూడా రైస్ మిల్లర్ల మధ్య ఫోన్లలో పంపించుకుంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీనిపై 16న సర్వసభ్య సమా వేశంలో తీవ్ర దుమారం చెలరేగే అవకాశం స్పష్టంగా కనపడుతున్నది.






