15 April, 2026 | 3:57 AM

మే 3న టీజీఆర్జేసీ సెట్ దరఖాస్తుకు నేడు ఆఖరు

15-04-2026 01:43 AM

హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే టీజీఆర్జేసీ సెట్ అప్లికేషన్ గడువు నేటితో ముగియనుంది. మే 3న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, 93 కేజీబీవీల్లో 2026 విద్యాసంవత్సరానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ కాలేజీల్లో మొత్తం 6700 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.