calender_icon.png 2 November, 2025 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికారాబాద్ జిల్లాలో దారుణం.. ముగ్గురిని హత్య చేసి ఆపై తానూ..

02-11-2025 10:28:11 AM

హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ముగ్గురిని హత్య చేసి తనూ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేపూరి యాదయ్యా(40) అనే వ్యక్తి, ఆయన భార్య అవివేలు(32) కుల్కచర్ల మండల కేంద్రంలో నివాసముంటున్నారు. వీరికి అపర్ణ(13), శ్రావణి(10) ఇద్దురు కుతూర్లు కూడా ఉన్నారు. భార్యాభర్తల మధ్య గత కొన్నాలుగా విభేదాలున్నాయి. ఇరువురి మధ్య గ్రామ, కుటుంబ పెద్దలు పంచాయతీ చేశారు. ఈ క్రమంలో యాదయ్య భార్య పిల్లలను తీసుకెళ్లేందుకు అలివేలు అక్క హన్మమ్మ(40) శనివారం ఇంటికి వచ్చింది. తెల్లారితే  భార్యా పిల్లలను తీసుకెళ్తారని భావించిన యాదయ్య రాత్రి వారంతా నిద్రిస్తున్న సమయంలో దారుణానికి ఒడిగట్టాడు. నిద్రపోతున్న  భార్య అలివేలు, వదిన హన్మమ్మ, చిన్న కుమార్తె శ్రావణిలపై   కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం పెద్ద కుమార్తెని కూడా చంపేందుకు ప్రయాత్నించడంతో ఆ బాలిక తప్పించుకొని బయటకు వెళ్లి స్థానికులకు విషయం తెలపింది. వారంతా వచ్చేలోపే యాదయ్య తనకు తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. చుట్టుపక్కల వారిని విచారించిన పరిగి డీఎస్పీ శ్రీనివాస్ వీరి మృతికి కుటుంబ కలహాలతో కారణమని తెలిపారు.  నలుగురి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.