4 April, 2026 | 4:10 PM

గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో

04-04-2026 02:46 PM

శాంతిభద్రతలు ఉన్నట్లా.. లేనట్లా?

హైదరాబాద్: గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్ రేగింది. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో కాంగ్రెస్ కార్యకర్తలు హల్ చల్ చేశారు. క్యాంప్ ఆఫీసు కిటిటీ అద్దాలు ధ్వంసం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. డీసీసీ ఆంక్షరెడ్డి కేసీఆర్ క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు. కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేతలు సీఎం ఫోటో పెట్టాం, దాడిచేయలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుపై కాంగ్రెస్ నేతల దాడిని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ముమ్మాటికి ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడిగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంపై సీఎం  రేవంత్ రెడ్డి చేయించిన దాడి అన్నారు. క్యాంపు ఆఫీసుపై దాడులు చేస్తుంటే శాంతిభద్రతలు ఉన్నట్లా.. లేనట్లా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాలపై దాడులు జరగడం సిగ్గుచేటని మండిపడ్డారు. క్యాంపు కార్యాలయంపై దాడిని పోలీసులు ఎందుకు అడ్డుకోవట్లేదు?, సీఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల్లో పొలిటికల్ టూర్లు చేస్తూ.. పాలనను గాలికి వదిలేశారా?, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆఫీసులపై దాడులు చేయాలని సందేశాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. క్యాంపు ఆఫీసులపై దాడులు జరిపిన వారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు ఆపకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుందని, తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.