01-02-2026 07:28:44 PM
బీఆర్ఎస్ దాడులను ఖండించిన కాంగ్రెస్ నేతలు
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మాట్లాడిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ చట్టపరిధిలో జరిగే విచారణకు భయమెందుకని ప్రశ్నించారు. సంక్షేమ పథకాల్లో దోపిడీకి ఆధారాలు ఉన్నాయనే విచారణకు పిలిచారని అన్నారు.
ప్రతిపక్షంగా ప్రశ్నించాలి కానీ దాడులు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ నేత భరత్ గౌడ్‌పై బీఆర్ఎస్ నేతల దాడిని మునిగేలా రాజు తీవ్రంగా ఖండించారు. దాడులకు దిగిన బీఆర్ఎస్ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో ఎక్కడ అవాంఛనీయ ఘటన జరిగినా కేటీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.