calender_icon.png 1 February, 2026 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసు అంట కట్టడం సిగ్గుచేటు

01-02-2026 07:24:36 PM

-సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. 

-నిరసన తెలుపుతున్న బిఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసిన  పోలీసులు

మోతె,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆదివారం మండల కేంద్రంలో  మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో  నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ  నిరసన తెలుపుతున్న నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడం గుర్తుకు వస్తుందా? అని ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఫోన్ టాపింగ్ కేసు పేరుతో సీట్ ద్వారా మాజీ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్పై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నూకల శ్రీనివాస్ రెడ్డి, మద్ది మధుసూదన్ రెడ్డి, బానోతు దేవల, నూకల యుగంధర్ రెడ్డి, బానోతు వెంకన్న, మండల యూత్ అధ్యక్షుడు జానీ పాషా, జిల్లేపల్లి ముత్తయ్య, మూడ్ క్రిష్ణ, ప్రభాకర్ రెడ్డి, రాము, రామకోటి, కాంపటి సైదులు, కార్యకర్తలు  పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.