అడవి శ్రీరాంపూర్‌లో సమ్మయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
13-06-2026 04:06 PM
ముత్తారం,(విజయక్రాంతి): అడవి శ్రీరాంపూర్ తాజా మాజీ ఎంపీటీసీ దొడ్డ గీతా రాణి సోదరుడు, ఎలిమిళ్ళ సమ్మయ్య ఇటీవల హుజురాబాద్‌లో అనారోగ్యంతో మరణించారు. ఈ విషాదకర వార్త తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయాల్సిందిగా స్థానిక నాయకులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు, అడవి శ్రీరాంపూర్ సర్పంచ్ కొట్టే ఉపేందర్ - అన్నపూర్ణ దంపతులు, వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సమ్మయ్య నివాసానికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కష్టకాలంలో వారికి ధైర్యం చెప్పి, తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.






