6 July, 2026 | 4:05 PM

Breaking News

8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •  

ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.

06-07-2026 03:32 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్వీనర్ గాజుల పోతన్న ఆధ్వర్యంలో పర్యటించారు. మండలంలోని ఆదివాసి గిరిజన గ్రామాలైన మహదుగూడ కేశవ్ గూడ నాగు గూడ చింతల బోరి గ్రామాలలో పర్యటించి ఓటరు జాబితా సవరణపై పరిశీలించారు. ఆయా గ్రామాలలో 235 238 239 పోలింగ్ బూతుల యందు డెబ్బై శాతం కార్యక్రమం పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు ఆయా గ్రామాల ప్రజలను మరింత చైతన్యం చేసినట్లయితే 100% పూర్తి అవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ఓటు ప్రాధాన్యతను గ్రామస్తులు వివరించారు. ఓటర్లను జాబితాలో చేరే విధంగా చూడాలని బిఎల్ఏలకు సూచించారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కస్సరే పోతన చింతలపూడి మాజీ సర్పంచ్ రాందాస్ అమృత రావు పాటిల్ కార్ ఎడ్ల శ్రీనివాస్ ఉన్నారు.