విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు
06-07-2026 02:46 PM
బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని చింతల బోరిలో రోడ్లపై బురద పేరుకుపోవడంతో విజయ క్రాంతి పత్రిక గత శనివారం వార్త కథనం ప్రచురించడం జరిగింది. దీంతో గ్రామపంచాయతీ పాలకవర్గం కార్యదర్శి స్పందించారు. సోమవారం ఉదయం రోడ్లపై పేర్కొన్న చెత్తాచెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గైక్వాడ్ శ్రీరామ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో ఉన్న నిధులతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు ఇకపై ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు






