calender_icon.png 20 September, 2025 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అంటే అభివృద్ధి సంక్షేమం

20-09-2025 06:16:13 PM

- మాజీ ఎమ్మెల్యే నిర్లక్ష్యంతో కోదాడ నియోజకవర్గ  వాసులకు అభివృద్ధి ఫలాలు అందని ద్రాక్షలా 

- బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో శాంతినగర్ అభివృద్ధి శూన్యం

- కాంగ్రెస్ నాయకురాలు గునుగుల స్వరూప రెడ్డి

అనంతగిరి: గ్రామ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గునుగుల స్వరూపారెడ్డి అన్నారు. శనివారం ఒక పత్రికా ప్రకటన ద్వారా మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటై కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా సమయంలో అభివృద్ధి సాధించలేక పోయామన్నారు. బొల్లం మల్లయ్య యాదవ్ ఒకసారి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికై  ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా అభివృద్ధి చేయకపోవడం సిగ్గుచేటు అని ఆమె అన్నారు. కెసిఆర్  ఉద్యమాల పేరుతో, బంగారు తెలంగాణా నాటకాలతో,మాయమాటలు చెబుతూ,అప్పుల పాలు చేస్తూ పేద ప్రజల సంక్షేమానికి అతన్కులుగా ఉన్నారని అన్నారు. తెలంగాణా ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చింది.

ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో తమ కళలు సాకారం చేసుకుందామంటే ప్రజలకు నిరాశే మిగిలింది అన్నారు. తెలంగాణాలో బడుగు బలహీన వర్గాలు యువకులకు అడి ఆశే అయింది.బాగుపడ్డది  కేవలం కేసిఆర్ కుటుంబం మాత్రమే అని చెప్పారు తెలంగాణా రాష్ట్రాన్ని చెదలు పట్టినట్టు పట్టి తెలంగాణా రాష్ట్రాన్ని మొత్తం కే.సి.ఆర్ కుటుంబం దోచుకుందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కోదాడ శాసనసభ్యులు పద్మావతి రెడ్డి సహకారంతో అన్ని గ్రామాలు మరియు మా గ్రామం అభివృద్ధి చెందుతుందని అన్నారు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతినగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతున్నామని చెప్పారు