calender_icon.png 20 September, 2025 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 'గులాబీ' జెండా రెపరెపలాడాలి

20-09-2025 06:15:51 PM

సమావేశ పరిశీలకులు బండారు రాజా

పెన్ పహాడ్: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొంది, గ్రామంలో గులాబీ జెండా రెపరెపలాడాలని ఆ పార్టీ బూత్ లెవెల్ సమావేశ పరిశీలకులు బండారు రాజా అన్నారు. శనివారం చీదెళ్లలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కీర్తి వెంకట్ రావు అధ్యక్షతన జరిగిన బూత్ లెవెల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్టీ అధిష్టానం సూచన మేరకే బూత్ లెవల్ కార్యకర్తలు, గ్రామ నాయకులు కార్యకర్తలు విధిగా లోబడి పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వెన్న సీతారాం రెడ్డి, మాజీ ఎంపీపీ నెమ్మది బిక్షం, మాజీ సర్పంచ్ పరెడ్డి సీతారాం రెడ్డి, మాజీ ఎంపీటీసీ జూలకంటి వెంకట్ రెడ్డి, బూత్ కమిటీ సభ్యులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.