20-09-2025 06:18:46 PM
లక్షేట్టిపేట,(విజయక్రాంతి): సామాజిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య నిపుణుల ద్వారా ఆరోగ్యకరమైన, శక్తివంతమైన కుటుంబము అనే వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా సురేఖ ప్రేమ్ సాగర్ రావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ... ఆరోగ్యకరమైన శక్తివంతమైన కుటుంబము కార్యక్రమాలు జిల్లాలో సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 96 కేంద్రాలలో చెపడుతున్నట్లు తెలిపారు. కిమ్స్ హైదరాబాద్ ఆసుపత్రి నుండి క్యాన్సర్ నిపుణులు డాక్టర్ ధీరజ్ ఆధ్వర్యంలో పరీక్షలు, చికిత్సలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
అదేవిధంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ యజ్ఞన శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైద్యులు, వైద్య సిబ్బంది ఐఎంఏ మంచిర్యాల్ తరఫున పాల్గొన్న 17 మంది ప్రైవేట్ వైద్య నిపుణులు, జిల్లాలోని వైద్య కళాశాల నుండి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి వచ్చిన స్పెషలిస్ట్ వైద్యులు డిస్టిక్ కోఆర్డినేటర్ హాస్పిటల్స్ నుండి వచ్చిన వైద్య నిపుణులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి వచ్చిన వైద్య సిబ్బంది వైద్యులు, జాతీయ పోషణ దినోత్సవాన్ని అంగన్వాడీ కార్యకర్తలు సిడిపివోలు సుప్రవైజర్లు ఎయిడ్స్ నియంత్రణలో భాగంగా అవగాహన కలిగించిన కళాకారులు హైదరాబాదులో సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్న బ్రౌన్ అనే ఎన్జీవో ద్వారా జిల్లాలోని క్షయ వ్యాధిగ్రస్తులకు 375 పోషకార కిట్లను ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు. సుమారు 300 మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకుని వైద్య సేవలను పొందడం జరిగిందన్నారు.