సిట్ ఎదుట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డిల ఫోన్ ట్యాపింగ్‌పై అధికారుల విచారణ
రాజకీయ ప్రత్యర్థులపై నిఘా ప్రజాస్వామ్యంపై దాడి: యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి
మా అమ్మ, భార్య ఫోన్లనూ ట్యాప్ చేశారు: అనిరుధ్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి(మహబూబ్‌నగర్), అనిరుధ్‌రెడ్డి(జడ్చర్ల) సోమవారం సిట్ ఎదుట, వేర్వేరుగా హాజరయ్యారు. బీఆర్‌ఎస్ హయాంలో వీరి ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురయ్యాయని గుర్తించిన అధికారులు.. విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు.
ఈ మేర కు ఎమ్మెల్యేలు ఇద్దరు సిట్ ఎదుట హాజరయ్యా రు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానా లు ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి సీఎ ల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడు తూ.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తన వ్యక్తిగత అంశమో, రాజకీయ అంశమో కాదన్నారు.
తెలంగాణ ప్రజల రాజ్యాంగబద్దమైన హక్కులకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశమన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉన్న తన ఫోన్ ట్యాపింగ్‌కు గురైందని చెప్పారు. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా తమ, తమ ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేశారని తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టడ మంటే ప్రజాస్వామ్యంపై దాడితో సమానమని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేవలం రాజకీయ నాయకులకు సంబంధించి కాదని జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు, న్యాయవాదులు, విద్యార్థులతో సహా ప్రతి వ్యక్తిదని తెలిపారు. తె లంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై 12 ఏళ్లు అయి న తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య బీఆర్‌ఎస్ పా ర్టీ వైషమ్యాలు రెచ్చగొడుతోందని ఆయ న మండిపడ్డారు.
రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో: అనిరుధ్‌రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్‌తో పాటు తల్లి, భార్య ఫోన్ నంబర్లను కూ డా ట్యాప్ చేశారని ఆరోపించారు. ఈ ఘటన తన కుటుంబ జీవితంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. కుటుంబ సభ్యుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం బాధాకరమన్నారు. ఇంటికి వెళ్తే తన భార్య తిడుతోందని, నీ వల్ల నా ఫోన్ కూడా ట్యాప్ చేశారని అంటుంటే ఏమీ చెప్పలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ కీయాల్లోకి రావడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. వ్యాపారం చేసుకుంటూ ఉంటే బాగుండేదని, రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అని ఇప్పుడు ఆలోచిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్య వహారంలో బాధ్యులపైన సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు చేపడుతారనే నమ్మకం ఉన్నదన్నారు.
పవన్‌కళ్యాణ్ తెలంగాణను కించపర్చితే ఊరుకోం: యెన్నెం
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తెలంగాణలో సభ పెట్టుకోవచ్చునని, తెలంగాణను కించపరిస్తే మాత్రం ఊరుకునేది లేదని యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. మొన్నటి వరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. చెట్టాపట్టాలు వేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. అ లాంటి కేసీఆర్ ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ వ్యతిరేకు లను ఓడించేందుకు కేసీఆర్ అన్ని విధాల సహాయం చేశారని ఆరోపించారు. గత ఎన్నికల్లో తెలంగాణలో కూటమి పోటీ చేసిందని, రానున్న ఎన్నికల్లో కూటమి వచ్చినా ఇంకెవరు వచ్చినా తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమేని ఆయన జోస్యం చెప్పారు.






