calender_icon.png 1 August, 2025 | 12:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీని విలీనం చేసిన వ్యక్తే.. ఫిరాయింపులపై మాట్లాడుతున్నారు

31-07-2025 02:23:33 PM

కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదని.. ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ లో చేరారు.

హైదరాబాద్: స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్(Congress MLC Addanki Dayakar) అన్నారు. 2014-18లో పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసిన వ్యక్తే.. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతున్నారని ఆరోపించారు. 2018-23లో సీఎల్పీని విలీనం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదని ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ లో చేరారని తెలిపారు. రాజ్యాంగానే మార్చాలని గతంలో కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) అన్నారన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.