01-08-2025 10:00:17 AM
హైదరాబాద్: నేడు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్(Yadadri Thermal Power Plant)లో యూనిట్ -1 ప్రారంభం కానుంది. 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన యూనిట్-1 జాతికి అంకితం చేయనున్నారు. వైటీపీఎస్ మొదటి యూనిట్ ప్లాంట్ ను తెలంగాణ ప్రభుత్వం జాతికి అంకితం చేయనుంది. యూనిట్ వన్ ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించనున్నారు. యూనిట్ వన్ ప్రారంభోత్సవంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ పాల్గొననున్నారు.
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం(Damaracherla Mandal) వీర్లపాలెంలో థర్మల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగింది. జెన్ కో ఒక్కోటి 800 మెగావాట్లు కలిగిన 5 యూనిట్లను నిర్మిస్తుంది. థర్మల్ పవర్ ప్లాంటులోని 2వ యూనిట్ ను డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి 3,4 వ యూనిట్ అందుబాటులోకి రానున్నాయి. 2026 మార్చిలోకా యూనిట్-5 పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ పనులకు కూడా ఇవాళ మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. నల్గొండ జిల్లాలో రూ.350 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ నిర్మించనున్నారు.