calender_icon.png 1 August, 2025 | 10:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్

31-07-2025 02:11:41 PM

హైదరాబాద్: అధికార కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన 10 మంది భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై త్వరగా, మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను కోరింది. అనర్హత చర్యలపై సకాలంలో చర్య తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆదేశించాలని కోరుతూ బీఆర్‌ఎస్ నాయకులు దాఖలు చేసిన పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి(Chief Justice of India) (సిజెఐ) బిఆర్ గవాయ్, జస్టిస్ ఎజి మసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్(Telangana Speaker Gaddam Prasad స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయనిపుణులతో చర్చిస్తానని పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు గతంలోనే నోటీసులు ఇచ్చామని వెల్లడించారు. అన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు.