16 June, 2026 | 5:48 PM

సాగు చేసే రైతులకే రైతుబంధు ఇవ్వాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

15-06-2024 04:08 PM

జగిత్యాల: సాగు చేసే రైతులకే రైతుబంధు పెట్టుబడి సహాయం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ని ఇందిరా భవన్ లో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.... సాగు చేసే రైతుల కె రైతుబంధు పెట్టుబడి సహాయం ఇవ్వాలని, గుట్టలకు, రియల్ ఎస్టేట్ భూములకు, బీడ్ భూము కు రైతు బంధు ఎందుకని ప్రశ్నించారు. సర్కార్ సోమ్ము అంటే అంత అలుసా అన్నారు. ఆదాని, అంబానీలకు కేంద్ర ప్రభుత్వం 60 లక్షల కోట్ల రాయితీ ఇచ్చిందని రైతుల నోట్లో మట్టి కొట్టిందని ధ్వజమెత్తారు.

 పంజాబ్ ప్రజలు ఇచ్చిన తీర్పుతో నరేంద్ర మోడీకి కనువిప్పు కలగాలని, ఏక్కడ మతం ఆరంభం అయిందో అక్కడే ఫలితాలు బీజేపీకి ప్రతికులంగా వెలుగులోకి వచ్చాయిని, ఉత్తరప్రదేశ్  పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మోడీ అహంకార ధోరణితో ఆర్ఎస్ఎస్ అసహనంలో ఉందని అన్నారు. జగిత్యాల మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాల విషయంలో ఎవరి మీద తాను ఆరోపణలు చేయలేదని ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడే తీరుచూస్తే బీఆర్ఎస్ నాయకులు చట్టానికి అతీతమా అన్నట్టు అనిపిస్తోందన్నారు.