మహబూబ్ నగర్ కలెక్టర్‌గా విజయేంద్ర బోయి
15-06-2024 02:35 PM
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కు విధులు నిర్వహిస్తున్న జి రవి నాయక్ ను శనివారం రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. మహబూబ్ నగర్ నూతన కలెక్టర్ గా విజయేంద్ర బోయి సోమవారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న విజయేంద్ర బోయి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా బదిలీ కావడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ బదిలీపై బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత జిల్లా కలెక్టర్ రవి నాయక్ పోస్టింగ్ ఎక్కడ అనే విషయం వెలువడ లేదని తెలిసింది.






