16 June, 2026 | 4:47 PM

ప్రియుడితో కలిసి కొడుకును హతమార్చిన ఓ కసాయి తల్లి

15-06-2024 08:17 PM

సంగారెడ్డి :  ఓ త‌ల్లి దారుణానికి పాల్ప‌డింది. త‌న సుఖం కోసం కుమారుడిని చంపింది. ఈ దారుణ ఘ‌ట‌న సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పటాన్ చెరువులోని మొత్తంగి వద్ద ఓఆర్ఆర్ సమీపంలో ఓ 10 ఏళ్ల బాలుడి మృతదేహాన్ని ఈనె 11వ తేదీన లభ్యమైంది. స్థానికుల సమచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం దవాఖానకు తరలించగా.. బాలుడి శరీరంపై గాయాలు ఉన్నట్లు వైద్యలు గుర్తించారు.

పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని తెలిపారు. పోలీసులు సంగారెడ్డి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లతో పాటు మూడు నగర కమిషనరేట్ల పరిధిలో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. కాగా.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్వాతి అనే వివాహిత భర్త చనిపోవడంతో అనిల్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కుమారుని గొంతు నులిమి చంపేసింది. ప్రియుడు అనిల్ తో కలిసి రాత్రి సమయంలో ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు పక్కన బాలుడి మృతదేహాన్ని పారేసినట్లు పోలీసుల విచారణలో స్వాయంగా ఆ కసాయి తల్లి ఒప్పుకుంది. దీంతో పోలీసులు తల్లి స్వాతి, ప్రియుడు అనిల్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.