17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

త్వరలో భద్రాచలం ఐటీఐ ఆధ్వర్యంలో గిరిజన మార్ట్

05-02-2026 12:00 AM

ఒకే చోట గిరిజనులు సేకరించే అన్ని అటవీ పలసాయాలు లభించే సౌకర్యం

భద్రాచలం, ఫిబ్రవరి 4, (విజయక్రాంతి): ఆదివాసి గిరిజనులు మరియు ప్రజల సౌకర్యార్థం ఐటిడిఏ పిఓ బి రాహుల్ ప్రత్యేక శ్రద్ధతో భద్రాచలం పట్టణంలోని గిరి బజారులో త్వరలో గిరి మార్ట్ ప్రారంభిస్తున్నందున సంబంధిత అధికారులు జిసిసి సేల్స్ మెన్ల సహకారంతో గిరిజనులు, ఎస్ హెచ్ సి గ్రూప్ మహిళలు తయారు చేస్తున్న వివిధ రకాల గృహ అవసరానికి సంబంధించిన వస్తువులను సేకరించాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. బుధవారం తన ఛాంబర్ నుండి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత ఐటీడీఏ స్పెషల్ ఆఫీసర్లు, జిసిసి మేనేజర్లు, ఏపిఎం, డిపిఎం, జిసిసి సేల్స్ మేన్లతో మండలాల వారీగా ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ అవసరాలకు సేంద్రీయ ఎరువులతో తయారుచేసే ప్రతి ఆహార పదార్థాలు మండలాల వారిగా సేకరించాలని, గిరిజన రైతుల వద్ద దొరికే బియ్యం, మక్కలు, జొన్నలు, రాగులు, సజ్జలు ఇతర ఆహార పదార్థాలు , మహిళలు తయారు చేసే పచ్చళ్ళు, ఇప్పపువ్వు లడ్లు, కరక్కాయ పౌడర్, కరక్కాయలు, తేనే, కారం, పసుపు, తృణ ధాన్యాలు ఇతర వస్తువులు మధ్య దళారులు తీసుకెళ్లకుండా నేరుగా గిరి మార్ట్ కు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. సంబంధిత స్పెషల్ ఆఫీసర్లు ఐకెపి ఏపీఎం, జిసిసి మేనేజర్లు, సేల్స్ మేన్ల సహకారంతో వారి పరిధిలోని గ్రామస్తులు తయారుచేసే ఆహార పదార్థాలను పరిశీలించి దానికి సంబంధించిన నివేదికలు సకాలంలో సమర్పించాలన్నారు.