calender_icon.png 15 December, 2025 | 11:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిషోర్ నాయక్ ఘన విజయం

13-12-2025 12:00:00 AM

బూర్గంపాడు,డిసెంబర్12,(విజయక్రాంతి): మండలంలోని సారపాక గ్రామ పంచాయితీ ఎన్నికల్లో కాం గ్రెస్, తెలుగుదేశం, సిపిఐ,సీపిఎం బలపర్చిన మిత్రపక్షాల అభ్యర్థి గుగులోత్ కిషోర్ నాయక్ సమీప ప్రత్యర్థి ధారవత్ చందు నాయక్ పై 2,990 ఓట్ల తో ఘన వి జయం సాధించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆశీస్సులతో బరిలోకి దిగిన కిషోర్ నాయక్ కు సారపాక ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కిషోర్ నాయక్ కు 4,945 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి చందు నాయక్ కి 1,955 ఓట్లు వచ్చాయి. అత్యధిక వార్డులు కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి కిషోర్ కు మద్దతుగా గత కొన్ని రోజులుగా కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ,సీపిఎం,ఐటిసీ టిఎన్టియుసి,ఐఎన్టియుసి, ఇండిపెండంట్ నాయకులు, కార్యకర్తలు గ్రామంలో విస్తృతంగా వాడ వాడలా తిరిగి విస్తృత ప్రచారం చేసి కిషోర్ నాయక్ విజయానికి బాటలు వేశారు.తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

తనపై నమ్మకంతో ఇంత మెజార్టీ ఇచ్చిన పంచాయతీ ప్రజలకు రుణపడి ఉంటా అని అన్నారు.సారపాక సమగ్ర అభివృద్ధికి, మానిఫెస్టో అమలుకు కట్టుబడి ఉన్నానని కిషోర్ నాయక్ తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ కి చెందిన కన్నేదారి రమేష్ ను ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.