15 April, 2026 | 8:38 AM

చతుర్ముఖ పోటీలో గెలుపొందిన నండ్రు అశ్విని

13-12-2025 12:00 AM

ఎర్రుపాలెం డిసెంబర్ 12 ( విజయ క్రాంతి):మండల కేంద్రంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో నండ్రు అశ్విని గెలుపొందారు. ఈ ఎన్నికను అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చతు ర్ముఖ పోటా పోటీ లో ఎర్రుపాలెం గ్రామ ప్రజలు నండ్రు అశ్విని నీ గెలుపొందించారు. కాంగ్రెస్ నుండి ఇద్దరు అభ్యర్థుల పోటీ చేయుగా మిగిలిన ఇద్దరూ ఇతర పార్టీల బలపరిచిన అభ్యర్థులు పోటీలో మొ త్తం నలుగురు అభ్యర్థులు పోటీపడ్డారు.

నామినేషన్ల ఉపసంహరణ అనంతరం గ్రామంలో పోటా పోటీగా ప్రచారం మొదలుపెట్టారు. మండలంలో కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయి ఒక వర్గం నుండి ఒక అభ్యర్థి వేరొక వర్గం నుండి ఒక అభ్యర్థిని మండల కేంద్రంలో పోటీ చేయడంతో ఈ ఎన్నికను . అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.కాంగ్రెస్ పార్టీ నుండి ఒక వర్గం తరపున నండ్రు అశ్విని ఉంగరం గుర్తుతో పోటీ చేయగా, వేరొక వర్గం తరఫున గుడేటి స్వాతి బాల్ గుర్తుతో పోటీ చేశారు.

మిగిలిన ఇద్దరిలో బి ఆర్ ఎస్ పార్టీ తరఫున సిపిఎం బలపరిచిన అభ్యర్థి ఉప్పు కనకదుర్గ కత్తెర గుర్తుతో పోటీ చేశారు. మరొక అభ్యర్థి బిజెపి పార్టీ బలపరిచిన దేవరకొండ అనిత బ్యాట్ గుర్తుతో బరిలో నిలిచారు. దీనితో ఎర్రుపాలెం మండల కేంద్రంలో చతుర్ముఖ పోటీ అనివారమైంది. కాంగ్రెస్ నుండి పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు మధ్యనే ఈ ఎన్నిక ఎంతో రసవతంగా జరిగింది.

ఈ ఎన్నిక నలుగురు అభ్యర్థులు గ్రామంలో పోటీ పడడంతో మండల కేంద్రంలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది. గతంలో ఇద్దరు అభ్యర్థుల నుండి మాత్రమే పోటాపోటీగా ఎన్నికలు జరిగేవి. కానీ ఈ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎంతో శ్రమించి ప్రణాళికబద్ధంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీలో పాల్గొన్నారు. నువ్వా నేనా అన్నట్లు జరిగిన ఎన్నికల్లో నండ్రు అశ్విని గెలుపొందారు. ఎన్నికల ప్రచారంలో గ్రామాభివృద్ధికి పాల్పడతానని నండ్రు అశ్విని పేర్కొన్నారు.