21 July, 2026 | 6:29 AM

కంటి చికిత్సలను పేదలకు చేయాలి

20-07-2026 03:12 PM

నిర్మల్,(విజయక్రాంతి): శ్రీ స్వర్గీయ కూచాడి సత్యమ్మ ప్రకాష్ రావు స్మారకార్థం ఏర్పాటు చేసిన ఎల్వి ప్రసాద్ కంటి పరీక్ష కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు కే శ్రీహరి రావు సందర్శించారు. అందుతున్న సేవలు, ఈ నెలలో సేవలు పొందిన లబ్ధిదారుల వివరాలను తెలుసుకున్నారు. ప్రజలకు ఉచితంగా అందుతున్న ఈ కంటి వైద్య సేవలను పేదలకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మామడ మండల నాయకులు రఫీ మహమ్మద్, పూదరి అరవింద్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గాజుల రవికుమార్, బాపయ్య, తదితరులు పాల్గొన్నారు.