calender_icon.png 27 November, 2025 | 4:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుంటకట్ట కబ్జాతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు

27-11-2025 12:24:58 AM

తూప్రాన్, నవంబర్ 26 :తూప్రాన్లోని అవుసుల కుంటకట్ట ఆక్రమణకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తూప్రాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, మామిళ్ళ కృష్ణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా కుంటలు, చెరువుల పైన కొరడా ఝుళిపించిందని గుర్తు చేశారు.

కొందరు పనిగట్టుకొ ని చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తూప్రాన్ ఆర్డీవో, ఇరిగేషన్ అధికారులకు తక్షణమే కుంటకట్టను యధాస్థితికి తీసుకురావాలని చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సిద్ధి రాములు గౌడ్, విశ్వరాజ్, కొడిప్యాక నారాయణ గుప్తా, పిట్ల సిద్ధిరాములు, బొల్లు నాగులు, ఉమర్, అజయ్ పాల్గొన్నారు.