calender_icon.png 27 November, 2025 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ విజయానికి కృషి చేయాలి

27-11-2025 12:24:32 AM

హాజీపూర్, నవంబర్ 26 : రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం పని చేయాలని మం చిర్యాల మాజీ ఎమ్మెల్య నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. హాజీపూర్‌లో బుధవారం బిఆర్‌ఎస్ పార్టీ హాజీపూర్ మండల ముఖ్య నాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యూహాలను దిశా నిర్దేశం చేసి, కాం గ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం అయ్యిందని, ప్రభుత్వ వైఫల్యంను ప్రజల్లోకి తీసుకెళ్లి బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, మాజీ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.