01-02-2026 02:02:27 PM
అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
సదాశివనగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మర్కల్ గ్రామ మాజీ సర్పంచ్ జూకంటి సంగారెడ్డి (50) శనివారం గుండెపోటుతో మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆదివారం మరకలు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
మరణ వార్త విన్న ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదివారం అంత్యక్రియల్లో పాల్గొని పాడే మోసి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నాయకున్ని కోల్పోయిందని ఆయన మృతి పార్టీకి తీయని లోటని అన్నారు.అందరిని కలుపుగోలుగా ఉండే అయన అకాల మరణం అందరిని కలసి వేసింది. గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. అత్యక్రియల్లో మండలంలోని అన్ని గ్రామాల నుండి భారీ సంఖ్యలో జనాలు పాల్గొన్నారు.