01-02-2026 02:05:55 PM
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలం
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మాజీ సీఎం కేసీఆర్కు ఇచ్చిన సీటు నోటీసులు వెనక్కి తీసుకోవాలి
నాగిరెడ్డిపేట్,(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్కు ఫోన్ టాపింగ్ నోటీసులు ఇవ్వడాని నిరసిస్తూ నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ ఆదేశానుసారం మండల కేంద్రంలో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వంకి ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడం గుర్తుకు వస్తుందా?అని ప్రశ్నించి మడిపడ్డారు.రాజకీయంగా ఎదగలేకనే ప్రతిసారి ఫోన్ టాపింగ్ కేసు పేరుతో సీటు ద్వారా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చేతకాని పాలన వల్ల వస్తున్న వ్యతిరేకత నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని మండల అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య తెలిపారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కెసిఆర్కు నోటీసులు ఇవ్వడం ఆపేసి ముందు రైతుబంధు డబ్బులు రైతుల్లో ఖాతాలలో జమ చేసి నిరూపించాలని యాసంగి పంటలు వేసి నెల రెండు నెలలు అవుతున్న ఇప్పటివరకు రైతుబంధు డబ్బులు ఇవ్వలేక నోటీసుల పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ నాటకలాడుతుందన్నారు.
అనంతరం స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ సంఘటన స్థలానికి వచ్చి నిరసనను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య, మాల్తుమ్మెద మాజీ సొసైటీ చైర్మన్ రాజిరెడ్డి, సర్పంచులు వంశీకృష్ణ గౌడ్, మహేందర్, నారాయణ, సాయిలు, సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి, పరిశోధన రెడ్డి, నరేష్, శ్రీనివాస్ గౌడ్, పుప్పాల నారాయణ, సాయిలు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.