calender_icon.png 11 January, 2026 | 2:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

07-01-2026 12:00:00 AM

డీసీసీ ఉపాధ్యక్షులు దరూరి యోగానంద చార్యులు 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జనవరి 6: గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని డీసీసీ ఉపాధ్యక్షులు,హైకోర్టు అడ్వకేట్ దరూరి యోగానంద చార్యులు అన్నారు.మంగళవారం మండల పరిధిలోని రామన్నగూడెం కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ,యూత్ కాంగ్రెస్ గ్రామశాఖ నూతన అధ్యక్షులను ఆయన సమక్షంలో ఎన్నుకున్నారు. నూతన కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిగా శివరాత్రి మహేష్,యూత్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఆమనగంటి నాగరాజులను ఎన్నుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతం దిశగా ముందుకు సాగి,రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని అన్నారు.

అనంతరం నూతన అధ్యక్షులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి గ్రామశాఖ బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు అనిరెడ్డి రాజేందర్ రెడ్డి, నర్సింగ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోరపాక సత్యం,శిగ నసీర్ గౌడ్, జాజిరెడ్డిగూడెం సర్పంచ్ బింగి కృష్ణమూర్తి, నాయకులు బైరబోయిన మహారాజు,వల్లాల ఖాజా, రమావత్ లాలు, నరేష్, నవీన్, సాయి, నర్సింహా, సైదులు, శేఖర్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.