07-01-2026 12:00:00 AM
హుజూర్‌నగర్ పట్టణంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించనున్న మంత్రులు
హుజూర్‌నగర్, జనవరి 6: జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలో నేడు రాష్ట్ర మంత్రులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా హుజూర్ నగర్ పట్టణంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామస్వామి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న 2160 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లను పరిశీలిస్తారు.రూ. 6 కోట్లతో నిర్మిస్తున్న కొత్త ఐటీఐ భవనం పరిశీలన,అనంతరం రూ. 40 కోట్లతో ఏర్పాటు చేసిన అధునాతన శిక్షణ కేంద్రం పనులను సమీక్షించనున్నారు.
రూ. 4.5 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల,రూ. 7.5 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాల కొత్త భవన నిర్మాణాలను సందర్శిస్తారు. రూ. 8 కోట్లతో నిర్మిస్తున్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్,షాపింగ్ కాంప్లెక్స్,రూ. 7 కోట్లతో చేపట్టిన నీటిపారుదల శాఖ కార్యాలయ పనులను పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం మంత్రులు ఏరియా ఆసుపత్రిని సందర్శించి వైద్య సేవలను పర్యవేక్షిస్తారన్నారు.