calender_icon.png 11 January, 2026 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘బ్లాక్‌చెయిన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’

07-01-2026 12:00:00 AM

జీఆర్‌ఐఈటీలో ప్రారంభం

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని గోకరాజు రంగరాజు ఇనిస్టిట్యూటూ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జీఆర్‌ఐఈటీ), ఇంట్యూటివ్ డేటా సొల్యూష న్స్ ప్రై.లి.తో కలిసి అకాడమియా ఇండస్ట్రీ భాగస్వామ్యంతో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సెంట ర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)ను మంగళవారం ఘనంగా ప్రారంభించింది. ఐడీఎస్ సంస్థ, అమెరికాలోని మిషిగన్ కేంద్రంగా పనిచేస్తున్న ఇన్ఫర్మేషన్ డేటా సిస్టమ్స్ (ఐడీఎస్) ఇన్. కి సోదరి సంస్థగా ఉంది.

ఈ కేంద్రం ద్వారా డిసెంట్రలైజ్డ్ టెక్నాలజీల్లో ఆధునిక పరిశోధన, ఆవిష్కరణలు, ఇండస్ట్రీకి అనుగుణమైన విద్య ను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా విద్యార్థుల కు లైవ్ ప్రాజెక్టులు, ప్రాక్టికల్ యూజ్ కేసులు, తాజా బ్లాక్చెయిన్ ఫ్రేమ్వర్క్లపై ప్రత్యక్ష అనుభవం అందించనున్నారు. ఈ సందర్భంగా ఐడీఎస్ సీఈఓ సుదర్శన్ మాట్లాడుతూ.. జీఆర్‌ఐఈటీతో మా భాగస్వా మ్యం ద్వారా విద్యార్థులకు వాస్తవ ప్రపంచ బ్లాక్చెయిన్ అప్లికేష న్లపై ప్రత్యక్ష అనుభవం అందించాలనుకుంటున్నాం.

లైవ్ ప్రాజెక్టుల ద్వారా భవిష్యత్కు సిద్ధమైన, అమలు చేయగల నైపుణ్యాలతో కూడిన ప్రొఫెషనల్స్ను తయారు చేయడం మా లక్ష్యం, అని తెలిపారు. వైస్ ప్రెసిడెంట్ సునీల్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్లు, నిపుణుల ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌లు, నిరంతర మెంటార్షిప్ ద్వారా విద్యార్థులకు అంతర్జాతీ య ప్రమాణాలకు అనుగుణమైన, కెరీర్కు ఉపయోగపడే నైపుణ్యాలను అందించను న్నాం, అని చెప్పారు. జీఆర్‌ఐఈటీ ప్రిన్సిపల్ డా ప్రవీణ్, డైరెక్టర్ జె.ఎన్. మూర్తి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోఆర్డినేటర్ డా.జి.కరుణ పాల్గొన్నారు.