25 July, 2026 | 1:47 AM

విద్యార్థుల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ అండ

25-07-2026 12:00 AM

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్ హెమమైన చర్య

పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి

టీపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు డిమాండ్

మంథని, జూలై 24 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ, కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై టిపి సిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలపై తీవ్ర ఆగ్రహం

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలపై దుద్దిళ్ల శ్రీనుబాబు ఘాటుగా స్పందించారు. ప్రవేశ పరీక్షల నిర్వహణలో పారదర్శకత పూర్తిగా లోపించిందని, పేపర్ లీకేజీలు మరియు అవకతవకలు నిత్యకృత్యంగా మారాయని మండిపడ్డారు. దేశ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన మోదీ ప్రభుత్వం, కనీసం పోటీ పరీక్షలను కూడా పకడ్బందీగా నిర్వహించలేకపోతోందని ఎద్దేవా చేశా రు. ప్రధాని మోదీ అసమర్థ పాలన వల్లనే విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

పరీక్షల నిర్వహణలో వరుసగా జరుగుతున్న అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని దుద్దిళ్ల శ్రీనుబాబు డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థుల కష్టాన్ని, వారి భవిష్యత్తును నీరుగార్చిన కేంద్ర ప్రభుత్వానికి పదవిలో కొనసాగే హక్కు లేదని స్పష్టం చేశారు. విద్యా, ఉద్యోగ, ప్రవేశ పరీక్షల నిర్వహణలో పూర్తిస్థాయి పారదర్శకతను కాపాడాలని కోరారు. 

రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీల అరెస్ట్ హెమమైన చర్య అక్రమ కేసులు ఎత్తివేయాలి

ప్రతిపక్ష నాయుడు రాహుల్ గాంధీ ఎంపీ ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునలను అక్రమంగా ఆరేస్ట్ హెమమైన చర్య అని, వారిని బస్సుల్లో కూడా నిర్బంధించి తీసుకువెళుతుంటే విద్యార్థుల కోసం వారు నినాదించిన తీరు యావత్ దేశాన్ని కట్టిపడేసిందని అన్నారు. తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, విద్యావ్యవస్థలో అక్రమాలను అరికట్టి, దేశ యువతకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ కార్గే ఆధ్వర్యంలో తామంతా విద్యార్థులకు అండగా నిలిచి పోరాడుతారని శ్రీనుబాబు స్పష్టం చేశారు.