25 July, 2026 | 1:47 AM

గాంధీచౌక్‌లో షిరిడీ సాయికి నోట్ల కట్టలతో అలంకరణ

25-07-2026 12:00 AM

ఖమ్మం, జులై 24(విజయక్రాంతి) : ఖమ్మం గాంధీచౌక్ వరప్రదాత షిర్డిసాయి మందిరం 16వ గురుపౌర్ణమి వేడుకలలో బాబా వారికి అన్నంతో అభిషేకం మరియు కనకాభిషేకం , చండీ హోమం జరిగింది . అదేవిధంగా బాబా వారి మందిరంలో గత నాలుగు రోజులుగా లక్ష్మీ గణపతి హోమం , ఆంజనేయ హోమం, సుదర్శన్ హోమం లు జరిగాయి. చివరి హోమం చండీ హోమం మరియు పూర్ణాహుతి జరిగింది . 108 యజ్ఞ కలశాలతో పంచమృతంతో అభిషేకలు జరిగింది .

బాబా వారిని కొత్త నోటులతో అలంకరించారు.  ఈ కార్యక్రమానికి షిరిడి సాయి మందిరం చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు, సెక్రటరీ శ్రీ అరవపల్లి నిరంజన్, పొట్టి ప్రసాద్, కురువెళ్ల జగన్మోహన్రావు, కాకరపర్తి సూర్యనారాయణ, వేములపల్లి శ్రీనివాసరావు, వేములపల్లి నరేష్, గన్నవరపు నాగేశ్వరరావు, కుసుమ శ్రీనివాసరావు, హనుమంతరావు, నూనె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు .