04-06-2025 11:45:45 AM
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగం సుధాకర్ రెడ్డి
తుంగతుర్తి, విజయ క్రాంతి: సూర్యాపేట జిల్లా(Suryapet District) నూతనకల్ మండలo మిర్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షుడు వేల్పుల కొమరమల్లు మృతి కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటు నూతనకల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగం సుధాకర్ రెడ్డి అన్నారు. బుధవారం వారి భౌతికాయానికి కాంగ్రెస్ జెండా కప్పి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దరిపెల్లి వీరన్ననూతనకల్ మండల ప్రధాన కార్యదర్శి బంటు బద్రి ఇరుగు కిరణ్ గునిగంటి వెంకన్న వేల్పుల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.