23 July, 2026 | 1:36 AM

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలవిస్తృతస్థాయి సమావేశం, నూతన కమిటీల ఏర్పాటు

23-07-2026 01:01 AM

రుద్రంగి జులై22(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ మం డల అధ్యక్షుడు ఎర్రం గంగానర్సయ్య ఆధ్వర్యంలో విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎర్రం గంగానర్సయ్య మాట్లాడుతూ.కాంగ్రెస్ పార్టీని బ లోపేతం చేయడానికి నూతన కమిటీలు వే యడం జరిగిందని అన్నారు.

ఎస్సి సెల్ అధ్యక్షుడిగా దయ్యాల శ్రీనివాస్,ఎస్టీ సెల్ అ ధ్యక్షుడిగా భూక్య తిరుపతి,మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా మహ్మద్ సదుల్లా ను నియమించినాట్టు తెలిపారు,నియోజకవర్గన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరా రు.ఈ కార్యక్రమంలో,సర్పంచ్ గండి నారాయణ,మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్,గడ్డం శ్రీనివాస్,తర్రె మనోహర్,ఉమ్మడి మానాల సర్పంచ్ లు,వార్డు మెంబర్లు,కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.